Wednesday, September 29, 2010

అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ?

అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ? : సత్యం బాబుకి శిక్ష పడటం చాలా మంది సంతోషంగా లేరు, సాధారణంగా ఇటువంటి కేసుల్లో శిక్ష వేయాలని చాలా మంది కోరుకుంటారు, ఎన్నో మహిళా సంఘాలు ఆందోళన చేస్తారు , కానీ కేసు తీర్పు విన్నాక కేసు తీర్పు అన్యాయం అని మహిళా సంఘాలు, సత్యం బాబు తల్లి మరియు ముఖ్యంగా అయేషా తల్లి కూడా అమాయకుడికి శిక్ష పడింది అని చెప్పటం గమనార్హం.

కేసు విచారణలో ఎన్నో లొసుగులు ఉన్నాయి :

1 ) అసలు అయేషా రేప్ & మర్డర్ జరిగిన హాస్టల్ వార్డెన్ గానీ , సెక్యూరిటీని గానీ , బిల్డింగ్ యజమానిని కానీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు , కనీసం విచారణ అయినా ఎందుకు చేయలేదు ?

2 ) అయేషా తల్లి చాలా మంది పేర్లు అనుమానితులు అని చెప్పింది , ఆమె మాటలు ఎందుకు పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు?

౩) ఈ కేసులో ముందుగా నిందుతుడు అని లడ్డు ని ప్రవేశపెట్టారు , తరువాత కాదు అని చెప్పారు ఎందుకు? సరే అక్కడ లబించిన పాద ముద్రికలు లడ్డు పద ముద్రికలుతో సరిపోయాయి అన్నారు , తరువాత అవే పాద ముద్రికలు సత్యం బాబుకి సరిపోయాయి అన్నారు ??? ఏమిటి ఎలా సాద్యం ? ఆరు అడుగులు ఉన్న లడ్డు , పిచుకలా ఉన్న సత్యం బాబు ఇద్దరి పాద ముద్రికలు ఒకే లా ఉంటాయా? మరియు లడ్డు , సత్యం బాబు DNA tests ఒకటేనా?

4 ) సత్యం బాబు తల్లి మాటల్లో చెప్పాలంటే , నా కొడుకు ఈ పాడు పని చేయలేదు, మమల్ని బందించి , సత్యం బాబుని తీవ్రంగా కొట్టి, ఒప్పుకోకపొతే మీ అమ్మ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు వాళ్ళని కూడా  చంపేస్తాం అని బెదిరించి తప్పు చేసినట్టు చెప్పించారు.

5 ) ఇంకా న్యాయవాదుల మాట ప్రకారం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షాలు గానీ , పరోక్ష సాక్షాలు గానీ లేవు అని చెపుతున్నారు మరి న్యాయనిర్ణేతలు ఈ శిక్ష ఎలా విధించారు ? ఎవరికోసం విధించారు?

ఇలా చెప్పుకుంటూ పొతే చాల విషయాలు ఉన్నాయి , ఈ కేసు ద్వారా న్యాయవ్యవస్తపై గౌరవం పోతుంది , రాజకియనయకులను కాపాడటానికి మాత్రమే పోలీసులు , న్యాయవాదులు, న్యాయవ్యవస్త అన్ని కలిసికట్టుగా పనిచేస్తే అంతకన్నా దొర్భాగ్యం ఇంకోటి ఉండదు , సత్యం బాబు కేసులో అదే జరిగింది కాదంటారా?

దీనిపై మీ కామెంట్స్ ఇవ్వండి, లేదా మీ అభిప్రాయాలను ramakrishnapoduru@gmail.com కు మెయిల్ చేయగలరు.

No comments:

Post a Comment

Followers