Friday, July 30, 2010

తెరాస గెలిస్తే - తెలంగాణా వాదం గెలిచినట్టేనా ?

తెరాస గెలిస్తే - తెలంగాణా వాదం గెలిచినట్టేనా ? : తెరాస ఈ ఉప ఎన్నికలలో గెలిచింది కాబట్టి తెలంగాణా వాదం గెలిచింది అని అంటున్నారు రాజకీయవేత్తలు, నాయుకులు, తెలంగాణా వాదులు ,తెరాస వాదులు మరియు మీడియా.
alaagaite  మరి మొన్న ఎన్నికలలో తెరాస ఓడిన ప్రాంతాలలో తెలంగాణా వాదం లేదని వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ..

అప్పుడు ఏమో ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేదు అంటారు ? ఇప్పుడేమో తెరాస గెలిచింది తెలంగాణా వాదం గెలిచింది అంటున్నారు ..
అపుడు ఓడిపోయినా చోట ఎన్నికలకి సెంటిమెంట్ కి సంబంధం లేనప్పుడు ఇపుడు గెలిచిన చోట ఎలా ఉంటాదో తెరాస వాళ్ళే సెలవుఇస్తే బాగుంటది. ఈ మాత్రం కూడా ఆలోచన , విశ్లేషన లేని మన తెలుగు మీడియా భావదరిద్ర్యానికి సలాం !!?? ఇది కూడా గ్రహించలేని ఓటరులకు కుడా సలాం !!!

కాంగ్రెస్ ఓటమిని బాగా ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ నాయుకులు

కాంగ్రెస్ ఓటమిని బాగా ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ నాయుకులు : ఈ ఉప ఎన్నికల లో కాంగ్రెస్ ఓటమిని మేము ముందు చెప్పాము అంటే మేము ముందు చెప్పామని, నాకు ముందే తెలుసు అని కాంగ్రెస్ నాయుకులు ఉప్పొంగిపోతున్నారు, అదీ మరి సంగతి , ఇప్పటికి తెరాసదే పైచేయి కావున మళ్లీ .. డిసెంబర్ 9, 2009  పరిస్తితులు వస్తాయి అని అనిపిస్తుంది .. ఏమంటారు , నాకు తెలియక అడుగుతాను వాళ్ళు ఎందుకోసం రాజీనామా చేసారు? మళ్లీ ఎందుకు గెలిచారు? వోట్లు వేసిన ప్రజలకు ఏమైనా తెలుసో లేదో ?
వాళ్ళు రాజీనామాతో తెలంగాణా రాలేదు , పోనీ గెలిపిస్తే వస్తాదా? చెప్పలేము ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయకముందు ఉండే స్టేజి కు మళ్లీ వెళ్లారు అంతే తప్ప వాళ్ళు సాదించింది శూన్యం . ప్రజలకు ఎన్నికల ఖర్చు , అధికారులకు ప్రయాస తప్ప ఏమి లేదు ఇందులో.

Thursday, July 29, 2010

దూసుకుపొతున్న తెరాస

ఉప ఎన్నికల ఫలితాల లో 11 స్తానాలలో దూసుకుపొతున్న తెరాస. ఒక్క చోట బిజెపి ఆదిక్యం. టిడిపి , కాంగ్రెస్ కు కలసిరాని ఉప ఎన్నికలు.

సచిన్ శ్రీలంకను డబుల్ తో పీకాడు


సచిన్ శ్రీలంకను డబుల్ తో  పీకాడు, శ్రీలంక తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది, సచిన్ డబుల్ సెంచురీ తో వీర విహారం చేసాడు , రికార్డ్స్ పై రికార్డ్స్ చేసుకుంటూ ఎవరికీ అందనత ఎత్తుకు దూసుకుపోతున్నాడు. రైనా కుడా మంచి సహకారంతో ఆడుతున్నాడు , .. సచినా మజాకా అంటూ శ్రీలంక తో ఆడుకుంటున్నాడు.

సురేష్ రైనా ఇరగదీసాడు- తొలి శతకం


యువరాజు గాయం వాళ్ళ వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని సురేష్ రైనా టెస్ట్ లో కూడా తన ఆటను చూపించాడు, మొట్ట మొదటి శతకం కూడా నమోదు చేసుకున్నాడు, సచిన్ తో కలసి ఇండియాను ఫాలో అప్ గండం నుండి గట్టేకించాడు. రైనా చాలా మంచి ప్రతిభావంతు .. కాదంటారా?  

సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు -నాయిని

తెలంగాణాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకోవటం పై తెరాస నేత నాయిని తీవ్రంగా స్పందిచి తెలంగాణాలో తెలంగాణా జనం  జగన్ ను తరిమి , తరిమి కొడతారు అని చెపుతున్నారు, పైగా సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు అని నాయిని గారు చెపుతున్నారు . ఇది ఎక్కడ విడ్డూరమో తెలియదు ఇప్పుడు వాళ్ళు అంతె TRS వాదులు ఎక్కడ ఉన్నారో తెలుసా ? వాళ్ళు ఇప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము అన్న విషయం కుడా తెలియని నాయకులా?
భారత దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు , జీవించవచ్చు, వ్యాపారం చేయవచ్చు, పని చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్న విషయం కూడా తెలియదా ?

నాయిని : సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదు
కెసిఆర్ : తెలంగాణా వచినా ఆంధ్ర వాళ్ళకు ఇబంది ఏమి ఉండదు ( ఒకసారి చెపుతాడు)
కెసిఆర్ : ఆంధ్ర భాగో .. ఆంధ్ర పేరు కనిపిస్తే కుదరదు  (ఇంకోసారి చెపుతాడు )

సో.. ఎవరు మాట నమ్మాలి కెసిఆర్ ఒకటి అంటాడు, నాయిని ఒకటి అంటాడు , రాజేందర్ ఒకటి అంటాడు .. వాళ్ళకే ఒక మాట లేదు , ఇంకా వీళ్ళు తెస్తారు తెలంగాణా ?

ఖచ్చితంగా , న్యాయంగా తెలంగాణా కోసమే పోరాటం చేసేవారు ఎందరు ఉన్నారు? ఉంటె ఈపాటికి తెలంగాణా ఎపుడో వచ్చేది .. ఏమంటారు.
నాయిని మాటలు నిజమంటారా ? సమైక్యవాదులు తెలంగాణాలో ఉండరాదా? ఎక్కడ ఉండాలి?

సాక్షి TV అంటేనే జనం పరుగులు పెడుతున్నారు

సాక్షి దినపత్రిక పెట్టినపుడు అది కేవలం రెండు రూపాయలకే దొరుకుతుంది అని చాలామంది ఉత్సాహంగా కొన్నారు పైగా మిగతా దినపత్రికల తో పోలిస్తే ఎక్కువ పేజీలు రంగుల్లోను లభిస్తుంది అని ఎగబడ్డారు, దాని ఫలితమే ఈనాడు దినపత్రికిను కుడా మించి అమ్ముడు పోయే పత్రికగా నిలిచింది. కానీ జనాన్ని ఆకట్టుకోవటంలో మాత్రం విపలమైంది అని మాత్రం చెప్పక తప్పదు. దానిలో ఎక్కవుగా కాంగ్రెస్ మరియు వై స్ కధనాలే వచ్చేవి, కొంతకాలానికి అవి జనానికి చిరాకుని కలిగించి ముందు అమ్మకాలతో పోల్చితే సాక్షి అమ్మకాలు పడిపోయాయి.

సాక్షి TV కూడా అంతే, మొదట్లో మొట్టమొదటి డిజిటల్ చానెల్ అని జనం ముందుకు వచ్చింది కానీ ప్రేక్షకులని అంతగా అలరించాలేదనే చెప్పకతప్పదు.  రాజశేకర్ రెడ్డి చనిపోయిన తరువాత నుండి ఇప్పటి ఓదార్పు యాత్ర వరుకు ఇంకా దిగజారింది. వై స్ జగన్ వార్తలు తప్ప వేరే ఎటువంటి వార్తలు కనిపించటం లేదు. రోజంతా ఓదార్పు యాత్ర మాత్రమే చూపిస్తున్నారు, ఏదో కొద్దిగా లేకపోతె మరి సొంత చానెల్ కాబట్టి ఒక గంట లేక రెండు గంటలు చూపిస్తే బాగుంటది గాని బాజా ఉంది కదా  అని వాయిస్తూనే ఉంటె విసుగు వస్తాది...... అవును అదే జరుగుతుంది చానెల్ మార్చినపుడు అయినా సాక్షి వస్తే వెంటనే మార్చేస్తున్నారు మన బుల్లి తెర అభిమానులు. అందుకే దేనికైనా అతి పనికిరాదు అని .. జగన్  అండ్ కో  వాళ్ళు చేస్తుంది అదే ....ఏమంటారు మీరు?

Followers