Tuesday, September 14, 2010

తెలుగు మీడియా విలువలు

Jagan AnnaImage via Wikipedia
వై . స్ . జగన్ వార్తలు తప్ప ఇంకేమి రాష్ట్రము లో వార్తలు లేవా ? సమస్యలు లేవా? తెలుగు మీడియా విలువలు ఏనాడో దిగ జరిపోయినాయి , కానీ ఇప్పుడు ఇంకా దిగజారిపోయి మీడియాలో వచ్చే వాటికి కనీసపు విలువకూడా లేదు,

మీడియా అన్నది ఏంటో విలువైనది అది ప్రజల సమస్యలు, బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలి కానీ కొన్ని మీడియాలు ప్రభుత్వానికి అండగా మరికొన్ని వ్యతిరేఖంగా పని చేస్తున్నాయి కానీ ప్రజల కోసం , సమాజం కోసం మాత్రం పని చేసేవి ఏమీ లేవు.
మెరుగైన సమాజం అని చెప్పే ఒక చానెల్ కూడా పొడిచింది ఎమీ లేదు , తెలుగు దేశంకి మద్దతుగా మూడు చానెల్స్ , రెండు పత్రికలూ , కాంగ్రెస్ కి ఒక పత్రిక, చానెల్ ఇలా అందరు జగనే వార్తలే వేస్తున్నారు , బ్యానర్ వార్తలు జగన్ వె , బ్రేకింగ్ న్యూస్ జగన్ వార్తలే , హెడ్ లైన్స్ కూడా జగన్ వార్తలే కాకపోతే మూడు చానెల్స్ వ్యతిరేఖంగా , సాక్షి అనుకూలంగా అంతె.

వీటికి విలువలేదు , నిజమైన మీడియాకు ప్రభుత్వాలు వణుకుతాయి , అవి పైకి తెసుకువచే సమస్యల పై వెంటనే స్పందిస్తాయి కానీ ఇప్పుడు అటువంటి చానెల్ ఒక్కటి కూడా లేదు , పైపెచు ఎవరికీ చానెల్ కావాలంటే వాళ్ళు ఒక చానెల్ పెట్టేస్తున్నారు , వారికి అంత అంత డబ్బు ఎక్కడినుండి వస్తుంది అని నెఇలదెసే నాధుడే లేదు , ఇన్ని చానెల్స్ వాళ్ళ మంచి కన్నా చెడు  ఎక్కువ జరుగుతుంది , ఇంకనుంచి అయినా తెలుగు మీడియా అంత ఒక్క తాటిపై వచ్చి ప్రజల సమస్యలని తెరపైకి తెసుకురావాలని ఆశిద్దాం , జగన్ వార్తలే కాకుండా జగత్ వార్తలు కూడా ప్రసారం చేస్తే బాగుంటది, వీళ్ళు జగన్ జపంతో జనం ని మరిచిపోతే జనం కూడా త్వరలోనే జనం కూడా వాటిని మరిచిపోతారు, జగన్ కు నేను వ్యతిరేఖం కాదు కానీ వార్త ఉన్నపుడు వేయాలి దానికి తగ్గ ప్రాధన్న్యం దానికి ఇవ్వాలి అని నా భావన , ప్రేక్షకులకి ప్రయోజకరమైన చర్చలు , వార్తలు  మరియు వినోద కార్యక్రమాలతో ఉండాలి అప్పుడే మీడియాకు అది ప్రసారం  చేసే వాటికి కనీసం విలువ అయినా దక్కుతాది.



No comments:

Post a Comment

Followers