Wednesday, September 29, 2010

అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ?

అయేషా _సత్యం కేసు బాబు : నిజా నిజాలు ఏమిటి ? : సత్యం బాబుకి శిక్ష పడటం చాలా మంది సంతోషంగా లేరు, సాధారణంగా ఇటువంటి కేసుల్లో శిక్ష వేయాలని చాలా మంది కోరుకుంటారు, ఎన్నో మహిళా సంఘాలు ఆందోళన చేస్తారు , కానీ కేసు తీర్పు విన్నాక కేసు తీర్పు అన్యాయం అని మహిళా సంఘాలు, సత్యం బాబు తల్లి మరియు ముఖ్యంగా అయేషా తల్లి కూడా అమాయకుడికి శిక్ష పడింది అని చెప్పటం గమనార్హం.

కేసు విచారణలో ఎన్నో లొసుగులు ఉన్నాయి :

1 ) అసలు అయేషా రేప్ & మర్డర్ జరిగిన హాస్టల్ వార్డెన్ గానీ , సెక్యూరిటీని గానీ , బిల్డింగ్ యజమానిని కానీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు , కనీసం విచారణ అయినా ఎందుకు చేయలేదు ?

2 ) అయేషా తల్లి చాలా మంది పేర్లు అనుమానితులు అని చెప్పింది , ఆమె మాటలు ఎందుకు పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు?

౩) ఈ కేసులో ముందుగా నిందుతుడు అని లడ్డు ని ప్రవేశపెట్టారు , తరువాత కాదు అని చెప్పారు ఎందుకు? సరే అక్కడ లబించిన పాద ముద్రికలు లడ్డు పద ముద్రికలుతో సరిపోయాయి అన్నారు , తరువాత అవే పాద ముద్రికలు సత్యం బాబుకి సరిపోయాయి అన్నారు ??? ఏమిటి ఎలా సాద్యం ? ఆరు అడుగులు ఉన్న లడ్డు , పిచుకలా ఉన్న సత్యం బాబు ఇద్దరి పాద ముద్రికలు ఒకే లా ఉంటాయా? మరియు లడ్డు , సత్యం బాబు DNA tests ఒకటేనా?

4 ) సత్యం బాబు తల్లి మాటల్లో చెప్పాలంటే , నా కొడుకు ఈ పాడు పని చేయలేదు, మమల్ని బందించి , సత్యం బాబుని తీవ్రంగా కొట్టి, ఒప్పుకోకపొతే మీ అమ్మ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు వాళ్ళని కూడా  చంపేస్తాం అని బెదిరించి తప్పు చేసినట్టు చెప్పించారు.

5 ) ఇంకా న్యాయవాదుల మాట ప్రకారం ఈ కేసులో ప్రత్యక్ష సాక్షాలు గానీ , పరోక్ష సాక్షాలు గానీ లేవు అని చెపుతున్నారు మరి న్యాయనిర్ణేతలు ఈ శిక్ష ఎలా విధించారు ? ఎవరికోసం విధించారు?

ఇలా చెప్పుకుంటూ పొతే చాల విషయాలు ఉన్నాయి , ఈ కేసు ద్వారా న్యాయవ్యవస్తపై గౌరవం పోతుంది , రాజకియనయకులను కాపాడటానికి మాత్రమే పోలీసులు , న్యాయవాదులు, న్యాయవ్యవస్త అన్ని కలిసికట్టుగా పనిచేస్తే అంతకన్నా దొర్భాగ్యం ఇంకోటి ఉండదు , సత్యం బాబు కేసులో అదే జరిగింది కాదంటారా?

దీనిపై మీ కామెంట్స్ ఇవ్వండి, లేదా మీ అభిప్రాయాలను ramakrishnapoduru@gmail.com కు మెయిల్ చేయగలరు.

Tuesday, September 14, 2010

తెలుగు మీడియా విలువలు

Jagan AnnaImage via Wikipedia
వై . స్ . జగన్ వార్తలు తప్ప ఇంకేమి రాష్ట్రము లో వార్తలు లేవా ? సమస్యలు లేవా? తెలుగు మీడియా విలువలు ఏనాడో దిగ జరిపోయినాయి , కానీ ఇప్పుడు ఇంకా దిగజారిపోయి మీడియాలో వచ్చే వాటికి కనీసపు విలువకూడా లేదు,

మీడియా అన్నది ఏంటో విలువైనది అది ప్రజల సమస్యలు, బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలి కానీ కొన్ని మీడియాలు ప్రభుత్వానికి అండగా మరికొన్ని వ్యతిరేఖంగా పని చేస్తున్నాయి కానీ ప్రజల కోసం , సమాజం కోసం మాత్రం పని చేసేవి ఏమీ లేవు.
మెరుగైన సమాజం అని చెప్పే ఒక చానెల్ కూడా పొడిచింది ఎమీ లేదు , తెలుగు దేశంకి మద్దతుగా మూడు చానెల్స్ , రెండు పత్రికలూ , కాంగ్రెస్ కి ఒక పత్రిక, చానెల్ ఇలా అందరు జగనే వార్తలే వేస్తున్నారు , బ్యానర్ వార్తలు జగన్ వె , బ్రేకింగ్ న్యూస్ జగన్ వార్తలే , హెడ్ లైన్స్ కూడా జగన్ వార్తలే కాకపోతే మూడు చానెల్స్ వ్యతిరేఖంగా , సాక్షి అనుకూలంగా అంతె.

వీటికి విలువలేదు , నిజమైన మీడియాకు ప్రభుత్వాలు వణుకుతాయి , అవి పైకి తెసుకువచే సమస్యల పై వెంటనే స్పందిస్తాయి కానీ ఇప్పుడు అటువంటి చానెల్ ఒక్కటి కూడా లేదు , పైపెచు ఎవరికీ చానెల్ కావాలంటే వాళ్ళు ఒక చానెల్ పెట్టేస్తున్నారు , వారికి అంత అంత డబ్బు ఎక్కడినుండి వస్తుంది అని నెఇలదెసే నాధుడే లేదు , ఇన్ని చానెల్స్ వాళ్ళ మంచి కన్నా చెడు  ఎక్కువ జరుగుతుంది , ఇంకనుంచి అయినా తెలుగు మీడియా అంత ఒక్క తాటిపై వచ్చి ప్రజల సమస్యలని తెరపైకి తెసుకురావాలని ఆశిద్దాం , జగన్ వార్తలే కాకుండా జగత్ వార్తలు కూడా ప్రసారం చేస్తే బాగుంటది, వీళ్ళు జగన్ జపంతో జనం ని మరిచిపోతే జనం కూడా త్వరలోనే జనం కూడా వాటిని మరిచిపోతారు, జగన్ కు నేను వ్యతిరేఖం కాదు కానీ వార్త ఉన్నపుడు వేయాలి దానికి తగ్గ ప్రాధన్న్యం దానికి ఇవ్వాలి అని నా భావన , ప్రేక్షకులకి ప్రయోజకరమైన చర్చలు , వార్తలు  మరియు వినోద కార్యక్రమాలతో ఉండాలి అప్పుడే మీడియాకు అది ప్రసారం  చేసే వాటికి కనీసం విలువ అయినా దక్కుతాది.



దెబ్బతిన్న పులి

దెబ్బతిన్న పులి : పవన్ కళ్యాణ , S.J. సూర్య Combination లో వచ్చిన కొమరం పులి సినిమా అంతగా ఆకట్టుకోవటం లేదు, అభిమనులు ఆశించిన స్తాయిలో లేకపోయినా కానీ వాళ్ళు కూడా నోళ్ళు వేల్లబెట్టేవిధంగా సినిమా ఉంది అని సమాచారం, ఎన్నో హంగులు , ఆర్భాటాలతో పాటుగా అవాంతరాలు దాటి బోను నుండి బయటికి వచ్చిన ఈ పులికి కాలం కలసిరాలేదు అని చెప్పాలి ఎందుకంటే , ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకోవటం , బడ్జెట్ పరిధులు దాటిపోవటం , అనుకున్న సమయానికి విడుదల కాకపోవటం , ముక్యంగా కధ, కధనాలు కుదరకపోవటం అంతే కాక A.R.Rehman సంగీతం కూడా ఏమంత గ్రాండ్ గా లేదు.

అయినా కానీ Collection మాత్రం ఇరగాదిస్తున్నాడు ఇప్పటికే రెండు రోజులకు 12 కోట్లు వసుల్ అయినాయి, సినిమాలో మేటర్ లేకుంటేనే పవన్ ప్రబంజనం ఇలా ఉంది , సినిమా కొద్ది బాగుఉన్నా సూపర్ హిట్ అయ్యేది.

Followers